AP Govt: ఎట్టకేలకు మణిపూర్ నుంచి విద్యార్థుల తరలింపుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు
ABN , First Publish Date - 2023-05-07T15:06:53+05:30 IST
మణిపూర్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అమరావతి: మణిపూర్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం (AP Government) చర్యలు చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాదాపు వంద మంది ఏపీ విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని ఆంధ్రాకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో ఏపీ అధికారులు మాట్టాడారు. ఏపీ విద్యార్థులను తరలించేందుకు పౌర విమానయాన శాఖ అంగీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక విమానం ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారం త్వరలోనే ఇస్తామని అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ఈ విషయంపై పౌర విమానయాన శాఖ మంత్రికి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ ( AP Bhavan Resident Commissioner Adityanath Das) లేఖ రాశారు. అలాగే ఏపీ విద్యార్థులకు తగిన సాయం చేయాలని మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.