AP News: ఏడవ రోజుకు అంగన్వాడీల సమ్మె
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:20 PM
Andhrapradesh: సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రైల్వే స్టేషన్ వద్ద నుంచి ధర్నా చౌక్ వరకు అంగన్వాడీలు భారీ ర్యా చేపట్టారు.
విజయవాడ: సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రైల్వే స్టేషన్ వద్ద నుంచి ధర్నా చౌక్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు చెబుతున్నారు. వాలంటీర్ల చేత అంగన్వాడీ వ్యవస్థను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. వాలంటీర్లు అందరూ మగవారని... స్కూలుకు వచ్చేది చిన్న పిల్లలు, ఆడపిల్లలు అని... వారి ఆలనా పాలన మగవారు చూస్తారా అని ప్రశ్నించారు. తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. అంగన్వాడీలు రాకపోతే స్కూల్‌కు విద్యార్థులను పంపమని తల్లిదండ్రులు ఖరాకండిగా చెబుతున్నారన్నారు. ‘‘జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి ప్రైమరీ స్కూల్ అని ఎలా నడుపుతాడో నడుపుకోమనండి... మేము చూస్తాం’’ అని అంగన్వాడీలు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...