యువగళం.. 3000 కి.మీ. సంబరం
ABN , First Publish Date - 2023-12-11T23:53:55+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
అనంతపురం అర్బన, డిసెంబరు 11: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, నాయకులతో కలిసి సోమవారం భారీ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, నాయకులు కూచి హరి, బ్రహ్మయ్య,
లక్ష్మీనరసింహ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.