కాలవను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు

ABN , First Publish Date - 2023-06-02T23:28:05+05:30 IST

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును విమర్శించే స్థాయి బొమ్మనహాళ్‌ వైసీపీ నాయకులకు లేదని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి పేర్కొన్నారు.

కాలవను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు

బొమ్మనహాళ్‌, జూన 2: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును విమర్శించే స్థాయి బొమ్మనహాళ్‌ వైసీపీ నాయకులకు లేదని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రంగాపురం క్యాంపులో స్థానిక టీడీపీ నాయకుడు గోవింద స్వగృహంలో గోవిందవాడ, దర్గాహొన్నూరు గ్రామాల టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గోవిందవాడ గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో జరిగిన ఘటనపై తెలుగుదేశం నాయకులే కాలవ శ్రీనివాసులు ఆదేశాలతోనే చేయించారన్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. గ్రామాలలో అలజడి సృష్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నది మీరేనని ఎద్దేవా చేశారు. కాపు రామచంద్రారెడ్డి మాయలో పడి నిజాయితీగా ఉన్న వైసీపీ నాయకులు మోసపోవద్దండని హితవు పలికారు. గోవిందవాడలో బియ్యం సక్రమంగా వేస్తున్నాం ఆనలైనలో పరిశీలన చేసుకోవచ్చని అంటున్నారే గ్రామంలోనే అంబేద్కర్‌ కాలనీలో మూడునెలలుగా ఎందుకు వేయడం లేదని సోమనాథ్‌గౌడ్‌ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మా కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారు. కాపు రామచంద్రారెడ్డిని టిక్కెట్‌ తెచ్చుకొని బరిలో నిలబడమని సవాల్‌ విసిరారు. సమావేశంలో తెలుగురైతు నియోజకవర్గ అధ్యక్షులు యర్రగుంట్ల వెంకటేశులు, బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప, అప్పారావు, సోమనాథ్‌గౌడ్‌, ఎస్‌జీ వన్నూరుస్వామి, నవీన, సైకిల్‌షాప్‌ హనుమంతు, సల్లాపురం బాబు, మాజీ డైరెక్టర్‌ నాగరాజు, ఆనంద్‌, రామస్వామి, రామాంజినేయులు, మాజీ సర్పంచు లు బెళ్లి హనుమంతరెడ్డి, దేవేంద్ర, గోవింద, బీసీసెల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సంగప్ప, గొల్ల తిప్పేస్వామి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:28:05+05:30 IST