Share News

బీసీలకు వైసీపీ అన్యాయం

ABN , First Publish Date - 2023-12-06T00:06:50+05:30 IST

వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యా యం జరిగిందని, బీసీలపై అరాచకాలు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపో తున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు.

బీసీలకు వైసీపీ అన్యాయం
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కాలవ, బీసీ సెల్‌ నాయకులు

‘బీసీల వెన్నువిరుస్తున్న జగనరెడ్డి’ పుస్తకావిష్కరణలో కాలవ

అనంతపురం అర్బన, డిసెంబరు 5: వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యా యం జరిగిందని, బీసీలపై అరాచకాలు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపో తున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. బీసీల వెన్నువిరుస్తున్న జగనరెడ్డి పుస్తకాన్ని మంగళవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ బీసీ సెల్‌, అనుబంధ విభాగాల నాయకులతో కలిసి ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో బీసీలపై జరుగుతున్న అరాచకాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం నింపాలన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బీసీలకు రక్షణ ఉంటుందన్నారు. రాబోవు ఎన్నికల్లో బీసీలంతా ఏకమై వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య, నాయకులు దేవళ్ల మురళీ, దళవాయి వెంకటనారాయణ, కుంచెపు వెంకటేష్‌, పోతులయ్య, రమణ, పెద్దన్న, వన్నూరు, చౌడయ్య, నాగేంద్ర, ఆదిశేషు, నరేంద్ర కుమార్‌ యాదవ్‌, చంద్ర, నారాయణస్వామి, ఓబుళపతి, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - 2023-12-06T00:06:51+05:30 IST