మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-09-04T23:51:06+05:30 IST
మున్సిపాలిటీ పరిధిలోని పూల కుంట గ్రామానికి చెందిన రమణమ్మ(62)అనే మహిళ ఎలకలమందు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హిందూపురం, సెప్టెంబరు 4 : మున్సిపాలిటీ పరిధిలోని పూల కుంట గ్రామానికి చెందిన రమణమ్మ(62)అనే మహిళ ఎలకలమందు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రమణమ్మ కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడుతుండేది. దీనికితోడు కడుపునొప్పి ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ఆదివారం రాత్రి ఎలుకల మందు తినింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు హిందూపురం అబ్‌గ్రేడ్ పోలీసులుకేసు నమోదుచేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమా ర్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పిల్లలిద్దరికీ వివాహమైందని తెలిపారు.