వామ్మో... ఇదేం పెంపు?

ABN , First Publish Date - 2023-06-03T00:54:08+05:30 IST

జిల్లాలో భూముల ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భారీగా పెంచేసింది. అనంతపురం సమీపంలో అత్యధికంగా 400 శాతం పెంచి పడేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. పట్టణాల పరిధిలో 30 నుంచి 40 శాతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ ధరకు సమానంగా రేట్లను నిర్ణయించారు.

వామ్మో... ఇదేం పెంపు?
రామ్‌నగర్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న రియల్టర్లు, డాక్యుమెంట్‌ రైటర్లు, భూ యజమానులు

అనంత చుట్టూ 400 శాతం పెంపు

జిల్లా వ్యాప్తంగా 30 నుంచి 100 శాతం

భారీగా పెరగనున్న రిజిసే్ట్రషన చార్జీలు

ప్రభుత్వంపై భగ్గుమంటున్న ప్రజలు, రియల్టర్లు

రామ్‌నగర్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద ధర్నా

అనంతపురం క్రైం, జూన 2: జిల్లాలో భూముల ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భారీగా పెంచేసింది. అనంతపురం సమీపంలో అత్యధికంగా 400 శాతం పెంచి పడేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. పట్టణాల పరిధిలో 30 నుంచి 40 శాతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ ధరకు సమానంగా రేట్లను నిర్ణయించారు. పెరుగుదలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. రిజిస్ర్టేషన ఫీజు పెరగడం, చలానా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో పెనుభారం తప్పదని రియల్టర్లు, భూముల యజమానులు, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా భూముల విలువలను పెంచలేదని, ఈ క్రమంలో ఒకేసారి పెంచడంతో ఎక్కువగా పెరిగినట్లు భావిస్తున్నారని అధికారులు సమర్థించుకుంటున్నారు.

రియల్టర్ల ఆందోళన

భూముల విలువ పెంపుపై ఆగ్రహించిన ప్రజలు, రియల్టర్లు శుక్రవారం రామ్‌నగర్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నగర సమీపంలోని కురుగుంట, ఉప్పరపల్లి, పాపంపేట, సోములదొడ్డి, కక్కలపల్లి గ్రామాల్లో భూముల ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. భూముల ధరలను వందల శాతం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో రిజిస్ర్టేషన శాఖ అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సమస్యను జాయింట్‌ కలెక్టర్‌ కేతన గార్గ్‌ దృష్టి తీసుకెళ్లారు. దీంతో కొంత ధర తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భారీగా పెంపు

- అనంతపురం చుట్టుపక్కల గ్రామాల్లో భూముల విలువను భారీగా పెంచేశారు. ఏకంగా 400 శాతం పెంచడంతో భూములను కొనేవారు, రియల్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. కురుగుంటలో చదరపు గజం రూ.1900 ఉండగా రూ.8 వేలకు పెంచారు. ఉప్పరపల్లిలో రూ.1900 ఉండగా రూ.8 వేలకు, పాపంపేటలో రూ.4 వేలు ఉండగా రూ.10 వేలకు, సోములదొడ్డిలో రూ.1900 ఉండగా రూ.8 వేలకు, కక్కలపల్లిలో రూ.3 వేలు ఉండగా రూ.6 వేల పైచిలుకుకు పెంచారు. ఈ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు పలుకుతోంది. రిజిస్ర్టేషన లెక్కల ప్రకారం మార్కెట్‌ విలువను రూ.4.80 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం నగరంలోని రామ్‌నగర్‌లో చదరపు గజం రూ.13 వేలు ఉంటే రూ.18 వేలకు పెంచేశారు. హౌసింగ్‌ బోర్డులో రూ.13 వేలు ఉండగా రూ.21 వేలకు పెంచేశారు.

- రాయదుర్గం మున్సిపాలిటీలో చదరపు గజం రూ.2,700 ఉండగా.. రూ.4500 నుంచి రూ.6000 వరకు ధరలు పెరిగాయి. ఉడేగోళంలో గజం రూ.600 ఉండగా రూ.2 వేలకు పెంచారు.

- గుంతకల్లు పట్టణ పరిధిలోని దోనిముక్కల, తిమ్మాపురంలో ఎకరా భూమి రూ.1.30 లక్షలు ఉండగా రూ.3 లక్షలకు పెంచారు. కసాపురంలో ఎకరా రూ.2.20 లక్షలు ఉండగా రూ.4 లక్షలకు పెంచారు. వజ్రకరూరు మండలంలో కొనకొండ్లలో రూ.1.40 లక్షలు ఉండగా రూ.3 లక్షలు చేశారు. గుంతకల్లు పట్టణంలో చదరపు గజం రూ.2800 ఉన్నవి రూ.4 వేలకు, రూ.3,200 ఉన్నవి రూ.4500కు పెంచారు. గరిష్ఠంగా రూ.13,800 ఉన్న ప్రాంతాల్లో రూ.16 వేలకు పెంచారు.

- తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో చదరపు గజం రూ.3800 నుంచి రూ.5వేల వరకు పెంచారు. గుత్తి పట్టణ పరిధిలో చదరపు గజం రూ.2600 ఉన్నచోట రూ.4వేలకు, రూ.3800 ఉన్నచోట రూ.5500కు పెంచారు. సమీప గ్రామాల్లో చదరపు గజం రూ.3800 నుంచి రూ.5500కు పెంచారు. తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడ, నందలపాడు, వీరాపురం, జంగంవారిపల్లె, తేరన్నపల్లె, హుస్సేనాపురం ప్రాంతాల్లో చదరపు గజం రూ.2 వేలకు పెంచారు.

రిజిసే్ట్రషన చార్జీల మోత

భూముల విలువ పెంపుతో రిజిస్ర్టేషన చార్జీలు భారీగా పెరగనున్నాయి. నగర శివారులోని పాపంపేటలో ఐదు సెంట్ల భూమి రిజిస్ర్టేషనకు చలానాతో పాటు రిజిస్ర్టేషన ఫీజుకు గాను రూ.75 వేలు ఖర్చయ్యేది. అక్కడ చదరపు గజం రూ.4వేలు ఉండగా రూ.10వేలకు పెంచారు. అదే ఐదు సెంట్ల భూమికి ప్రస్తుతం రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నగర సమీప గ్రామాల్లో పెంచిన రేట్లకు అనుగుణంగా రిజిస్ర్టేషన ఫీజు పెరగనుంది. దీనికితోడు మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించాల్సి వస్తుందని రియల్టర్లు వాపోతున్నారు.

ఇంత తేడా ఎప్పుడూ లేదు..

ఈ సారి భూముల విలువలు భారీగా పెంచేశారు. గతంలో ఇంత తేడా ఎప్పుడూ చూడలేదు. అనంతపురం చుట్టుపక్కల ధరలు పెంచడం వలన చాలా మందిపై భారం పడుతుంది. ఇకపై ఆ భూములు కొనాలన్నా, అమ్మాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

- మల్లేష్‌, నారాయణపురం

ఫీజు బాదుడే...

భూముల ధరలను నాలుగు రెట్లు పెంచడం దారుణం. దీనివల్ల రిజిస్ర్టేషన చార్జీలు కూడా అదేస్థాయిలో పెరుగుతాయి. కొనుగోలుదారులు అదనంగా ఫీజు చెల్లించక తప్పదు.

- గంగాధర్‌, బళ్లారి బైపాస్‌

ఇప్పటికే వ్యాపారం లేదు..

ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింది. ఇలాంటి సమయంలో భూముల ధరలు ఇన్ని రెట్లు పెంచడం సరికాదు. పెంచిన ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలి. రిజిస్ర్టేషన్లు కాకపోతే ఆదాయం రాదు.

- వెంకటేష్‌, పాపంపేట

ఇంతలా ఎలా పెంచారు?

ప్రభుత్వం 30 నుంచి 35 శాతంలోపు భూముల ధరలను పెంచాలని ఆదేశాలిచ్చింది. కానీ అధికారులు కొన్నిచోట్ల 50 నుంచి 400 శాతం వరకు పెంచారు. ఒకరిద్దరి నిర్ణయంతో ఇలా భూముల ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడితే ఎలా? ఇలా పెంచితే ఇప్పట్లో భూములను కొనటం కష్టమవుతుంది.

- రామాంజి, పాపంపేట

Updated Date - 2023-06-03T00:54:08+05:30 IST