చంద్రబాబు కోసం ఎంత దూరమైనా వెళతాం!

ABN , First Publish Date - 2023-09-18T00:23:52+05:30 IST

చంద్రబాబును రక్షించుకోవడా నికి ఎంతదూరమైనా వెళతామని జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు పేర్కొన్నారు.

చంద్రబాబు కోసం ఎంత దూరమైనా వెళతాం!

రాయదుర్గం, సెప్టెంబరు 17: చంద్రబాబును రక్షించుకోవడా నికి ఎంతదూరమైనా వెళతామని జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం తెలుగుయువత ఆధ్వర్యంతో నిర్వహిస్తున్న నిరసన రిలేదీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును అరెస్టు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. జగన జైలులో ఉన్నపుడు ఎవరూ రోడ్డుమీదకు కూడా రాలేదని దీన్ని బట్టి చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న బలమేంటో తెలుసుకోవాల న్నారు. జగనను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నార న్నారు. చరిత్రలో జగన అధ్యాయం ఇక ఆరునెలలకు ముగిసిపోనుం దని, భవిష్యతలో ఆయనకు మళ్లీ అధికార పగ్గాలు అందవనే విషయం గుర్తించుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు రమేష్‌, పైతోట అంజి, రంగస్వామి, దానవేంద్ర, ముత్తయ్య, రవిచంద్ర, కిరణ్‌, నాగరాజు, తిప్పేస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T00:23:52+05:30 IST