సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తాం
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:02 AM
కదిరిఅర్బన, డిసెంబరు 21: సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 10వరోజుకు చేరింది.
- స్పష్టం చేసిన అంగనవాడీలు - పదో రోజూ హోరెత్తిన నిరసనలు
కదిరిఅర్బన, డిసెంబరు 21: సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 10వరోజుకు చేరింది. ఈ సందర్భంగా కదిరి పట్టణంలో ఆర్‌అండ్‌బీ బంగ్లానుం కాలేజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సీఎం జగన ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతవరకు సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన నాయకురాళ్లు మాబూన్నీసా, లక్ష్మీదేవి, శారద, సుజాత, రామలక్ష్మీ, సరోజ, రైతు సంఘం జిల్లా నాయకుడు సుబ్బిరెడ్డి, సీఐటీయూ నాయకుడు నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.