ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేస్తాం: మాజీ మంత్రి

ABN , First Publish Date - 2023-06-02T23:34:03+05:30 IST

మండలంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతామని మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు.

ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేస్తాం: మాజీ మంత్రి

పుట్లూరు, జూన 2: మండలంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతామని మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. మండలంలోని పుట్లూరు, కందికాపుల, చింతకుంట గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను స్టిక్కర్‌ కోసం ఎమ్మెల్యే కావాలనుకొనే బ్యాచ కాదన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఎమ్మెల్యే కావాలి, ఎందుకు కావాలి అన్న ప్రశ్న నాముందు ఎప్పుడు ఉందన్నారు. మా అవసరం ఉందా లేదా ఉందను కుంటే కచ్చితంగా ఆలోచిస్తాం, మా అన్నదమ్ములతో చర్చించి అలా ఏమైనా మార్పులు ఉంటే తప్పకుండా చెబుతానని ఆయన తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ప్రసాద్‌, విష్ణునారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-02T23:34:03+05:30 IST