అభివృద్ధిని స్వాగతిస్తాం... అన్యాయాన్ని సహించం
ABN , First Publish Date - 2023-12-11T00:14:05+05:30 IST
ధర్మవరంలో ఎవరు అభివృద్ధి చేసినా స్వాగతిస్తామని, బాధితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ అన్నారు.
పరిహారం ఇచ్చి రైల్వే బ్రిడ్జి పనులు చేయండి
కేతిరెడ్డి నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేస్తాం
భవిష్యత్తుకు గ్యారెంటీలో పరిటాల శ్రీరామ్
ధర్మవరంరూరల్, డిసెంబరు10: ధర్మవరంలో ఎవరు అభివృద్ధి చేసినా స్వాగతిస్తామని, బాధితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆదివారం మండలంలోని గొల్లపల్లి, బడన్నపల్లి గ్రామాల్లో బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలకు వెళ్లిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటీకి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపీణీ చేసి పథకాలను వివరించారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు శ్రీరామ్ దృష్టికి తెచ్చారు. సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో జరుగుతున్న అభివృద్ధికి తాము అడ్డుపడమని, బాధితులకు పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తే పోరాడుతామన్నారు. కదిరిగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఇళ్లు కూల్చివేతలు చేపడుతున్నారని, కొంతమంది బాధితులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నా వాటిని లెక్కచేయకుండా అధికారులు, పోలీసుల సహాకారంతో కూల్చివేతలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేతిరెడ్డికి ప్రజలన్నా, వారి సమస్యలన్నా లెక్కలేనితనమని, ఆయన నిరంకుశత్వానికి ప్రజలు అడ్డుకట్ట వేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నివర్గాల ప్రజలను ఆదుకునేందుకు మినీ మేనిఫెస్టో విడుదల చేశారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతిహామిని నెరవేరుస్తామని తెలిపారు. వచ్చేఎన్నికల్లో ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయ్‌కుమార్, చిగిచెర్లఓబిరెడ్డి, కమతం కాటమయ్య, మహే్‌షచౌదరి, మద్దిలేటి, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు, గొట్లూరు శ్రీనివాసులు, తలారి వెంకటలక్ష్మీ, విజయసారథి, సర్పంచ ముత్యాలప్పనాయుడు, పాళ్యం వెంకటేష్, బడన్నపల్లి క్రిష్ణ, రామాంజి, కాటమయ్య, నాగరాజు, ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, గరుడంపల్లి అంజి పాల్గొన్నారు.