పంచాయతీ కార్మికులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:09 AM
నగర పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి
మడకశిరటౌన, డిసెంబరు 27: నగర పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. అధికారులు బెదిరించినా సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్న కార్మికులు అధైర్య పడవద్దని తాము అండగా ఉంటామనిన్నారు. మడకశిర నగర పంచాయతీ కార్యాలయం ఎదుట రెండో రోజు బుధవారం నగర పంచాయతీ కార్మికులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరపున ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ... న్యాయమైన సమస్యలు పరిష్కరించమని నగరపంచాయతీ కార్మికులు కోరి తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పాదయాత్ర సమయంలో, గత ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారని అన్నారు. వాటిని అమలు చేయాలని కోరితే ఎదురు దాడికి దిగడం, వేధించడం వంటి వాటికి పాల్ప డటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అంగనవాడీ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, ఆశావర్కర్లు, సమగ్ర శిక్షా అభియాన ఉద్యోగులు చివరకు వలంటీర్లు సైతం రోడ్డు మీదకు ఎక్కే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఎ న్నడూ చూడలేదన్నారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యల పరిష్కారానికి తాము బాధ్యత తీసుకుంటామని అ ప్పటి వరకు పోరాటానికి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, పట్టణ అధ్యక్షుడు మనోహర్, మైనా రిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ ఉమాశంకర్, నాయకులు ఎస్ నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.