జీతాలివ్వలేని ప్రభుత్వం మాకొద్దు....!
ABN , First Publish Date - 2023-11-19T23:28:08+05:30 IST
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వం తమకొద్దని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. దివాలా తీసిన ప్రభుత్వం అవసరమా..? అంటూ 2024 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

దివాళా తీసిన ప్రభుత్వం అవసరమా....? ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిమ్మన్న
అనంతపురం విద్య, నవంబరు 19: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వం తమకొద్దని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. దివాలా తీసిన ప్రభుత్వం అవసరమా..? అంటూ 2024 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీయూ జిల్లా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి తిమ్మన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు, ఉపాఽధ్యాయులు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం సమయానికి జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేస్తోందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి 70 లక్షల మంది ఓటర్లను ఏకం చేస్తామని స్పష్టం చేశారు. జీవో 117 తీసుకొచ్చి స్కూళ్లను నిర్వీర్యం చేశారన్నారు. బైజూస్, టోఫెల్, సీబీఎ్‌సఈ అంటూ రోజుకొక సిలబస్ పేరు చొప్పి...విద్యార్థులను గందరగళానికి గురి చేస్తున్నారన్నారు. డీఎస్సీ విడుదల చేయలేదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు సూర్యుడు, ప్రధానకార్యదర్శి రమణారెడ్డి, ఇతర జిల్లా, రాష్ట్ర నాయకులు ప్రసాద్, రంగనాథ్, శివయ్యచారి, సూర్యనారాయణ, రామాంజనేయులు, కృష్ణ మోహన, కృష్ణప్ప, సురేష్, కిశోర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.