వక్ఫ్‌ ఆస్తులు కాపాడాలి : ముస్లిం జేఏసీ

ABN , First Publish Date - 2023-06-03T00:06:44+05:30 IST

స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ముస్లింలను మభ్యపెట్టకుండా వక్ఫ్‌ ఆస్తులు కాపాడాలని ముస్లిం జేఏసీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

 వక్ఫ్‌ ఆస్తులు కాపాడాలి : ముస్లిం జేఏసీ

కదిరి అర్బన, జూన 2: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ముస్లింలను మభ్యపెట్టకుండా వక్ఫ్‌ ఆస్తులు కాపాడాలని ముస్లిం జేఏసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానికంగా జేఏసీ సభ్యులు టీఎండీ ఇలియాజ్‌, ఎంఎస్‌ ఖతాబ్‌, మస్తాన విలేకరులతో మాట్లాడారు. కుటాగుళ్ల వద్ద కబరస్తాన, దర్గా, 400-ఏలో వక్ఫ్‌ ఆస్తుల్లో ఆర్‌బీఓ నిర్మాణానికి ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆర్‌ఓబీకి గతంలో ఇచ్చిన ప్లాన ప్రకారమే చేపడతామని రైల్వే జేఈ నాగేంద్ర చెబుతున్నారన్నారు. అయితే నాలుగు లైన్ల రహదారి కాకుండా రెండు లైన్ల రహదారి మాత్రమే నిర్మిస్తున్నట్లు ప్రజాప్రతినిధి, అధికార పార్టీ కౌన్సిలర్లు పేర్కొంటున్నారని తెలిపారు. రెండు లైన్లు రహదారి అయితే దర్గా బయట మార్కింగ్‌ వేయాలని, అలా కాకుండా దర్గా లోపలనే మార్కింగ్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. 400-ఏలో ఆర్‌ఓబీ వెళ్తే 2.38 ఎకరాల భూమి కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. పెనుకొండ వద్ద ఆర్‌ఓబీ నిర్మించారని, అక్కడ ఎవరికీ నష్టం చేయలేదన్నారు. అదేవిధంగా కదిరిలో కూడా నిర్మించాలలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, చుట్టూ కంచె వేయడానికి విరాళాలు సేకరిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-03T00:06:44+05:30 IST