ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి : బీకే

ABN , First Publish Date - 2023-03-03T22:38:52+05:30 IST

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మె ల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువే సి గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఓటర్లను అభ్యర్థించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి : బీకే

గోరంట్ల/మడకశిరటౌన/రొళ్ల/పెనుకొండరూరల్‌/రొద్దం/ హిందూపురం, మార్చి 3: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మె ల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువే సి గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం ఆయన మండలంలోని పాలసముద్రం, బూది లి, మల్లాపల్లి, గోరంట్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి ముమ్మరంగా చేపట్టారు. కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవే ట్‌ పాఠశాలలకు వెళ్లి, రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈసందర్భంగా బీకే మాట్లాడారు. రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని, విద్య, వ్యవసాయం, యువతకు ఉపాధి అవకాశాలు కుదేలయ్యాయన్నారు. ఉద్యోగులు ప్రతినెలా ఒకటిన జీతాలందక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం కాకుండా చేయాలంటే పట్టభద్రుల చేతుల్లోనే ఉందని తెలిపారు. సమర్థవంతుడైన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే, టీడీపీకి ఓటువేసి గెలిపించడం ద్వారా ప్రజలకు విద్యావంతులైన మీరు చక్కటి సందేశాన్ని ఇవ్వాలన్నారు. ప్రలోభాలకు పోయి మరోసారి పొరపాటుచేస్తే దేవుడు కూడా ఈరాష్ట్రాన్ని కాపాడలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మడకశిర పట్టణంతోపా టు రొళ్ల మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విస్తృతంగా పర్యటించారు. రామగోపాల్‌రెడ్డికి మద్దతుగా ఎ న్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి చం ద్రబాబుకు కానుకిద్దామని, రామగోపాల్‌రెడ్డి గెలుపుతోనే తెలుగుదే శం పార్టీ గెలుపు ప్రారంభమవుతుందని అన్నారు. హొట్టేబెట్ట, రొళ్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌, మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, నియోజకవర్గ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు. పెనుకొండ మండలం తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రవిశంకర్‌, జిల్లా అధికార ప్రతినిధి రఘువీరచౌదరి, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామలింగ, కౌన్సిలర్‌ గిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాం గోపాల్‌రెడ్డికి మద్దతుగా ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి ఓటు ను అభ్యర్థించారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షు డు రియాజ్‌, క్రిస్టియన మైనార్టీ అధ్యక్షుడు ఆండ్రోస్‌, ఆవుల రాము, శ్రీహరి, నాగరాజు, కొమ్మ వెంకటేశ, గిరి, ఖలీల్‌, నాగరాజు, చలపతి పాల్గొన్నారు. రొద్దం మండలం తాడంగిపల్లి, మోపర్లపల్లి, కొత్తపల్లి, గౌరాజుపల్లి గ్రామాల్లో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సతీమణి బీకే కమలమ్మ, టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ప శ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పాఠశాలలో ఉపాధ్యాయులు, పట్టభద్రులతో కలిసి ఓటును అభ్యర్థించారు. కార్యక్రమం లో హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు చిన్నప్పయ్య, కన్వీనర్‌ నరహరి, స ర్పంచ మంజునాథ్‌, సాయికిరణ్‌, ప్రభాకర్‌, భాస్కర్‌, శివన్న, ఆది, మోహన, మాజీ సర్పంచ నారాయణప్ప, ఎం కొత్తపల్లి సర్పంచ నాగరాజు పాల్గొన్నారు. హిందూపురం పట్టణం, రూరల్‌ మండలం, లే పాక్షి, చిలమత్తూరు మండలాల్లో టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈసందర్భంగా నాయ కులు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రతియేడాది జాబ్‌ క్యాలెండర్‌ అంటూ నిరుద్యోగుల ను నట్టేట ముంచారన్నారు. ఉద్యోగులకు నెలంతా కష్టపడితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్‌ లాంటివని, మేధావులు ఆలోచించి టీడీపీ మ ద్దతుతో బరిలో ఉన్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి ఓటేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, ప రిశీలకులు గొర్రెల శ్రీధర్‌, కన్వీనర్‌ అశ్వర్థరెడ్డి, రంగారెడ్డి, జేపీకే రా ము, రాఘవేంద్ర, హెచఎన రాము, చిక్కిరప్ప, నాగరాజు, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా హిందూపురం పట్టణాధ్యక్షుడు రమే ష్‌, అమర్నాథ్‌, వెంకటేశ, బాచి, తిమ్మయ్య, సునీల్‌ తదితరులు పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

నేడు అమరాపురంలో ప్రచారం

మడకశిరటౌన(అమరాపురం): పశ్చిమ రాయలసీమ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి మద్దతుగా టీడీపీ ఆధ్వర్యం లో శనివారం అమరాపురం మండలంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆర్‌జయకుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు బసవనపల్లి నుంచి ప్రచారం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర టీడీపీ ఉ పాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి హాజరవుతారని, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2023-03-03T22:38:52+05:30 IST