భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:28 AM
ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోవిందనామస్మరణతో మారుమ్రోగాయి.
ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోవిందనామస్మరణతో మారుమ్రోగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయాల వద్ద క్యూ కట్టారు. రామగిరి మండలం నసనకోట సమీపంలో తిరుమల దేవర వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జ్ఞాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, శింగనమల తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.