టీడీపీ హయాంలోనే వడ్డెర్ల అభివృద్ధి
ABN , First Publish Date - 2023-07-30T23:50:24+05:30 IST
టీడీపీ హయాంలోనే వడ్డెర్ల అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవళ్ల మురళి పేర్కొన్నారు.
వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవళ్ల మురళి
గుంతకల్లుటౌన,జూలై30: టీడీపీ హయాంలోనే వడ్డెర్ల అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవళ్ల మురళి పేర్కొన్నారు. స్థానిక అంకాలమ్మ దేవాలయంలో ఆదివారం గుంతకల్లు వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మునిస్వామి, పట్టణ మాజీ అధ్యక్షుడు వీఎం రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా దేవళ్ల మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో మొట్టమొదటిగా వడ్డెర కార్పొరేషన ఏర్పాటు చేసి రూ. 147 కోట్లు కేటాయించిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ పాలనలో ఆదరణ పథకం కింద పనిముట్లు, ఫెడరేషన ద్వారా నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన అధికారంలోకి వచ్చాక వడ్డెర్లు తీవ్ర అన్యా యానికి గురవుతున్నారు. కార్యక్రమంలో వడ్డెర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు దేరగుల నాగశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి మధురాజు, జిల్లా కమిటీ సభ్యుడు నాగ రాజు, పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ, వడ్డెర యువజన సంఘం అధ్యక్షుడు వడ్డె ప్రభా కర్, నాయకులు ఎర్రగుడి గోవిందు, ఆంజనేయులు, దొరరాజు, పాల రామాంజినేయులు, రాజు, గోపి, తదితరులు పాల్గొన్నారు.