యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు
ABN , First Publish Date - 2023-09-21T23:37:49+05:30 IST
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ ఫెన్షన విధానాన్ని పరిరక్షించాలని రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు
రాప్తాడు, సెప్టెంబరు 21: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ ఫెన్షన విధానాన్ని పరిరక్షించాలని రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా గురువారం రాప్తాడులో ఎంపీడీఓ కార్యాలయం ముందు యూటీఎఫ్ స్మారక జండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రమణయ్య, అధ్యక్షుడు లింగమయ్య, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు పాల్గొన్నారు.