Share News

నిరుద్యోగుల నిరసన ర్యాలీ

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:20 PM

మెగా డీఎస్సీ, జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేసి తమకు ఉద్యోగాలు కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆదివారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు

నిరుద్యోగుల నిరసన ర్యాలీ
ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులు

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 24: మెగా డీఎస్సీ, జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేసి తమకు ఉద్యోగాలు కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆదివారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏఐఎస్‌ఏ జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, పీడీఎస్‌యూ జిల్లా కోశాధికారి బాండరు శంకర్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో జగనమోహనరెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి సీఎం అయ్యారని, ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలను భర్తీచేయలేదని, డీఎస్సీ నోటిఫికేషన ఇవ్వలేదని మండిపడ్డారు. మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే కేసీఆర్‌ తగే జగనకూ పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, ఇస్మాయిల్‌, నాగేంద్ర, మంజునాథ్‌, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:20 PM