కలెక్టర్‌ నాగలక్ష్మి బదిలీ

ABN , First Publish Date - 2023-04-07T00:57:35+05:30 IST

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి బదిలీ అయ్యా రు. ఆమె రెండేళ్ల క్రితం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. మృధు స్వభావి అయిన ఆమె వివాదాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో పాలన సాగిస్తూ వచ్చారు. ప్రధానంగా ఉద్యోగ వర్గాల్లో కలెక్టర్‌ నాగలక్ష్మి పట్ల మంచి గౌరవం ఉంది. రాజకీయాల్లోనూ పెద్దగా జోక్యం చేసుకోరన్న పేరు తెచ్చుకున్నారు.

కలెక్టర్‌ నాగలక్ష్మి బదిలీ

అనంత పురం టౌన, ఏప్రిల్‌ 6: జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి బదిలీ అయ్యా రు. ఆమె రెండేళ్ల క్రితం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. మృధు స్వభావి అయిన ఆమె వివాదాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో పాలన సాగిస్తూ వచ్చారు. ప్రధానంగా ఉద్యోగ వర్గాల్లో కలెక్టర్‌ నాగలక్ష్మి పట్ల మంచి గౌరవం ఉంది. రాజకీయాల్లోనూ పెద్దగా జోక్యం చేసుకోరన్న పేరు తెచ్చుకున్నారు. అయితే అధికార పార్టీ వివిధ భూ సమస్యల విషయాల్లో కొనసాగించిన అక్రమాలపై కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోలేదన్న అపవాదు ఉంది. అధికార పార్టీ నేతలు కూడా కలెక్టర్‌ నాగ లక్ష్మి పట్ల సానుకూలత కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కలెక్టర్‌ ఎన్నికల నిబంధనల మేరకు వెళ్లారు. అప్పుడు అధికార పార్టీ అభ్యర్థితో పాటు రాష్ట్రస్థాయి అధికార పార్టీ నేతలు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక విజేతను ప్రకటించకుండా చూడాలని, రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అయినా కలెక్టర్‌ ఎన్నికల నిబంధనలకు లోబడి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనకు పంపించి అక్కడి నుంచి ఆమోదం తీసుకొని ప్రకటించారు. దీనిపై అధికార పార్టీ అభ్యర్థితో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో కీలక సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సైతం మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్‌ వ్యవహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కలెక్టర్‌ బదిలీ అవుతారని ప్రచారం సాగుతూ వస్తోంది. అన్నట్లుగానే కలెక్టర్‌ నాగలక్ష్మిని ఇక్కడి నుంచి బదిలీ చేసి విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె భర్త శ్రీకాకుళం జిల్లా జేసీగా పనిచేస్తున్నారు. తాజాగా కలెక్టర్‌ నాగలక్ష్మిని విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

కొత్త కలెక్టర్‌ గౌతమి

జిల్లా కొత్త కలెక్టర్‌గా గౌతమి నియమితులయ్యారు. 2014 ఐఏఎస్‌ బ్యాచ. ఈమె ప్రస్తుతం తిరుపతి జిల్లా ఎలకా్ట్రనిక్‌ మ్యానిఫాక్చరింగ్‌ క్లస్టర్‌ సీఈఓగా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి అనంత జిల్లా కలెక్టర్‌గా నియ మిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమి గతంలో ఉమ్మడి అనంత జిల్లాలో అనంతపురం ఆర్‌డీఓగా పనిచేశారు.

Updated Date - 2023-04-07T00:57:35+05:30 IST