Share News

బాలికను హింసించడం దారుణం

ABN , First Publish Date - 2023-11-22T00:02:11+05:30 IST

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా ఉన్న దంపతులు వారి ఇంట్లో మైనర్‌ బాలిక ను పని మనిషిగా పెట్టుకోవడమే కాకుండా.. ఆ బాలికను విచక్షణా రహితంగా గాయాలు అయ్యేలా హింసించడం దారుణమని విపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు.

బాలికను హింసించడం దారుణం
టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌ నేతల నిరసన

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాల నిరసన

అనంతపురం అర్బన / ప్రెస్‌క్లబ్‌, నవంబరు 21: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా ఉన్న దంపతులు వారి ఇంట్లో మైనర్‌ బాలిక ను పని మనిషిగా పెట్టుకోవడమే కాకుండా.. ఆ బాలికను విచక్షణా రహితంగా గాయాలు అయ్యేలా హింసించడం దారుణమని విపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. మంగళవారం టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల నాయకులు డీఎంహెచఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదే సమయంలో కార్యాలయానికి వచ్చిన డీఎంహెచఓను ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆమెతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను చూసేందుకు వెళుతున్న నాయకులు, తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరి గింది. అనంతరం బాలికకు చికిత్స అందించిన డాక్టర్‌ను బయటకు పిలిపించి బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకారులకు ఆరా తీశారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి న్యాయం అందించాల్సిన న్యాయవాది వృత్తిలో ఉంటూ మైనర్‌ బాలికను చీకటి గదిలో అసభ్యంగా ప్రవర్తించడం హేయమ న్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు అందించడంతోపాటు సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి తగిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు స్వప్న, విజయశ్రీరెడ్డి, సంగా తేజస్వి ని, సరళ, జానకి, టీడీపీ నాయకులు ముక్తియార్‌, దే వళ్ల మురళీ, గుర్రం నాగభూషణం, సిమెంట్‌ పోలన్న, సైఫుద్దీన, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్‌, జయమ్మ, అవుకు విజయ్‌కుమార్‌, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్‌, రొళ్ల భాస్కర్‌, కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:02:12+05:30 IST