ఆ నాలుగు శాఖలవే ఫిర్యాదులెక్కువ : కలెక్టర్
ABN , First Publish Date - 2023-09-25T23:52:22+05:30 IST
స్పందన కార్యక్రమంలో ప్రధానం గా రెవె న్యూ, వ్యవసాయ, విద్యుత, సర్వే శాఖలకు సంబందించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నా యని, అధికారులు ఆ సమస్యలు తర్వగా పరిష్కరిం చాలని కలెక్టరు గౌతమి సూచిం చారు.

అనంతపురం టౌన, సెప్టెంబరు 25: స్పందన కార్యక్రమంలో ప్రధానం గా రెవె న్యూ, వ్యవసాయ, విద్యుత, సర్వే శాఖలకు సంబందించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నా యని, అధికారులు ఆ సమస్యలు తర్వగా పరిష్కరిం చాలని కలెక్టరు గౌతమి సూచిం చారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 417 ఫిర్యాదు అందాయి. కలెక్టరుతో పాటు డీఆర్‌ఓ గాయిత్రీదేవి, ఆర్డీఓ మధుసూ దన, డిప్యూటీ కలెక్టరు శ్రీనివాసులు ఆ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని సూచించారు.