నా విజయాన్ని అడ్డుకున్నారు

ABN , First Publish Date - 2023-03-19T00:58:26+05:30 IST

: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా సాగిందని, ఎలిమినేషన రౌండ్‌లో ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తన విజయాన్ని అడ్డుకున్నారని స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికలపై కోర్టుకు వెళుతున్నానని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను ఓడిపోవడానికి ఎన్నికల సిబ్బందే కారణమని ఆరోపించారు.

నా విజయాన్ని అడ్డుకున్నారు

ఎన్నికల నిర్వహణపై కోర్టుకు వెళతా

స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డి

అనంతపురం విద్య, మార్చి 18: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా సాగిందని, ఎలిమినేషన రౌండ్‌లో ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తన విజయాన్ని అడ్డుకున్నారని స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికలపై కోర్టుకు వెళుతున్నానని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను ఓడిపోవడానికి ఎన్నికల సిబ్బందే కారణమని ఆరోపించారు. అర్హత లేని ప్రైవేటు స్కూళ్ల టీచర్లను ఓటరు జాబితాలో చేర్చారని, అర్హత ఉన్న టీచర్లను వేలాదిగా తిరస్కరించారని పేర్కొన్నారు. అర్హులైన టీచర్లు ఓటరు నమోదు కోసం గడువులోగా దరఖాస్తు చేసినా ఎన్నికల కమిషన పరిగణనలోకి తీసుకోలేదని, ఇది ఓటర్ల హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను తొలగించాలని ఎన్నికల కమిషనకు, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. కౌంటింగ్‌కు ముందు రోజు, పోలింగ్‌ రోజున ఇంటర్‌ లెక్చరర్లకు ప్రశ్నాపత్రాలు తీసుకొచ్చే బాధ్యతలు అప్పగించి, వారు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సా్ట్రంగ్‌ రూమ్‌లో కూడా భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 2వ ప్రాధాన్య ఓటు లెక్కించే సమయంలో ఎలిమినేషన అయ్యే ఒక్కో అభ్యర్థి ఓట్లను ఒకసారి లెక్కించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారని, వారి ఓట్లను లెక్కించారని వాపోయారు. రీ కౌంటింగ్‌ చేయాలని తాను ఆర్‌ఓను కోరగా.. ఎన్నికల కమిషన నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పి.. ఫలితాలను ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి తనను ఓడించారని ఆరోపించారు.

Updated Date - 2023-03-19T00:58:26+05:30 IST