వైసీపీ ప్రభుత్వం అన్నింటా విఫలం
ABN , First Publish Date - 2023-11-20T23:50:18+05:30 IST
అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
అనంతపురం అర్బన, నవంబరు 20: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. సోమవారం అనంతపురం అర్బన పరిధిలోని 39వ డివిజనలో బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నటేష్ చౌదరి, చేపల హరి, బంగి నాగ, ముక్తియార్, గుర్రం నాగభూషణం, పీఎం లక్ష్మీప్రసాద్, గోపాల్ గౌడ్, బాలప్ప, చెరుకుతోట పవనకుమార్, కడియాల కొండన్న, గంగవరం అంజి, తెలుగు మహిళలు శివబాల, జానకి, కృష్ణవేణి పాల్గొన్నారు.