నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: బీకే

ABN , First Publish Date - 2023-05-31T23:40:35+05:30 IST

ఒక్క చాన్సుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అ న్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటో చూపించారని టీడీపీ జి ల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు.

నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: బీకే

పెనుకొండ మే 31: ఒక్క చాన్సుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అ న్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటో చూపించారని టీడీపీ జి ల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు. బుధవారం స్థానిక టీ డీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పా లనలో విసిగి వేసారిన ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉ న్నారన్నారు. మహానాడుకు తరలివచ్చిన లక్షలాది మంది ప్రజలే ని దర్శనమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికా రంలోకి రావడం ఖాయమన్నారు. మహానాడు వేదికలో విడుదల చేసి న మినీ మెనిఫెస్టోతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతు న్నాయన్నారు. పేదలను సంపన్నులు చేయడానికి టీడీపీ కృషి చేస్తుం దని చంద్రబాబు ప్రకటించారన్నారు.

కృతజ్ఞతాహీనుడు.. స్పీకర్‌ తమ్మినేని

తెలుగుదేశం పాలనలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నత పదవులను క ట్టబెట్టి రాజకీయ భిక్షపెట్టిన చంద్రబాబు నాయుడును స్పీకర్‌ తమ్మినేని సీతారాం విమర్శించడం నీచ సంస్కృతికి నిదర్శనమని, కృతజ్ఞతా హీ నుడని బీకే ఈసందర్భంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుం చి నాయకునిగా ఎదిగిన విషయం ఆయన మరిచారన్నారు. చంద్ర బాబు కమెండోలు లేకపోతే బయటకు కూడా రాలేరని మాట్లాడటంపై బీకే ఈమేరకు స్పందించారు. గతంలో చంద్రబాబుపై జరిగిన దాడుల ను దృష్టిలో పెట్టుకొని ఆయనకు బ్లాక్‌ కమాండోలను ఇచ్చారనే వి షయం గుర్తుంచుకోవాలన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ మహానా డు విజయవంతం కావడంతో వైసీపీ నాయకులకు మతి భ్రమించి ఓట మి భయంతో ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారన్నారు. రాబోవు రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

కార్యక్రమంలో నాయకులు బక్సంపల్లి రామకృష్ణప్ప, రొద్దం నారప్ప, కన్వీనర్లు సిద్దయ్య, రవి శంకర్‌, తోటగేరి చంద్ర, పోతిరెడ్డి, పా లడుగు చంద్ర, గుట్టూరు నాగరాజు, ఆదిశేషు, షీఫారం చంద్ర, నారా యణ నాయక్‌, బాబయ్య, కన్నా, హుజూరుల్లా ఖాన, బావెద్‌, వాహిద్‌, రియాజ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:40:35+05:30 IST