ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల చేతుల్లోనే!

ABN , First Publish Date - 2023-09-21T23:39:44+05:30 IST

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల చేతుల్లోనే!

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు

కంబదూరు (కళ్యాణదుర్గం), సెప్టెంబరు 21: ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. గురువారం కళ్యాణదుర్గం ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట బాబుకు మేము సైతం అంటూ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లిరి చెందిన 20 కుటుంబాలు జనసేన పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపి ఉమామహేశ్వరనాయుడుకు పూలమాలలు వేసి సన్మానించారు. అంతకుముందు నిరాహారదీక్షలో నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వర యాదవ్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ ప్రజా అజెండానే టీడీపీ అజెండాగా ముందుకు సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారన్నారు. గ్రామగ్రామాన టీడీపీ విజయమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

రిలే దీక్షకు సంఘీభావం

బ్రహ్మసముద్రం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కళ్యాణదుర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు తెలుగుయువత అధ్యక్షుడు నీలాస్వామి సంఘీభావం తెలిపారు. ఆయనతోపాటు తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కురుగౌడ వున్నారు.

Updated Date - 2023-09-21T23:39:44+05:30 IST