దుర్మార్గపు పాలన అంతానికి ప్రతిపక్షాలు ఏకంకావాలి
ABN , First Publish Date - 2023-05-02T00:00:43+05:30 IST
రాష్ట్రంలో దుర్మార్గపుపాలనను అంతమొందించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని తమ అధినేత పవనకల్యాణ్ కంకణం కట్టుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం
ధర్మవరం, మే 1: రాష్ట్రంలో దుర్మార్గపుపాలనను అంతమొందించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని తమ అధినేత పవనకల్యాణ్ కంకణం కట్టుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. చిలకం తన స్వగృ హంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో ఆరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. దీనిని అంతమందించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకుందామన్నదే తమ అధినేత లక్ష్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును తమఅధినేత పవనకల్యాణ్ కలిస్తే వైసీపీ మంత్రులకు వచ్చిన నష్టమేమిటో అర్థంకావడంలేదన్నారు. మంత్రులు రోజా, పేర్నినాని, కొడాలినాని పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఇకపై మా కార్యకర్తలపై దాడులు చేస్తే పండ్లు ఊడకొడతామని ఆయన హెచ్చరించారు.