భవన నిర్మాణ కార్మికుల బతుకులు కుదేలు
ABN , First Publish Date - 2023-11-22T00:04:14+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవితా లు కుదేలవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు.

వైసీపీ పాలనపై సవిత విమర్శ
పెనుకొండ టౌన, నవంబరు 21 : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవితా లు కుదేలవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు. ఆమె మంగళవారం పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ... రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి రంగంలో భవన నిర్మాణరంగం మూడో స్థానంలో ఉందన్నారు. దాదాపు 60లక్షల మంది ఈ రంగం ద్వారా జీవనో పాధి పొందుతున్నారన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక, సిమెంటు తదితర భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెంచడంతో నిర్మాణాలు జరుగక 70శాతం మంది పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారు చాలామంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో మబ్బులు నింపిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుట్టూరు సూరి, మండల మాజీ కన్వీనర్ శ్రీరాములు, త్రివేంద్ర, వాసుదేవరెడ్డి, బాబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.