ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:20 AM
బుక్కపట్నం, డిసెంబరు 27: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య విమర్శించారు.
- భవిష్యత్తుకు గ్యారెంటీలో మాజీ మంత్రి పల్లె, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య
బుక్కపట్నం, డిసెంబరు 27: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య విమర్శించారు. మండలకేంద్రంలో బుధవారం టీడీపీ శ్రేణులు బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వారు పాల్గొని నాయకులు, కార్యకర్తలతో పాటు ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ మినీమేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని విస్మరించిందని దుయ్యబట్టారు. గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. 2024లో టీడీపీ అఽధికారంలోకి వస్తే ఎలాంటి వివక్షలేకుండా అర్హులకు సంక్షేమపథకాలు అందిస్తామని చెప్పారు. టీడీపీ విజయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కన్వీనర్లు, నాయకులు వెంకటరాములు, సాకే యశోద, లావణ్యగౌడ్, సోమశేఖర్, బాలు, సయ్యద్, రామాంజి, తెలుగుయువత నాయకుడు సతీ్‌షరాయల్, నాయకులు, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు శ్రీనివాసులు, సుధీర్, చంద్ర, మంజు, జనసేన నాయకుడు దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు.