Share News

బాబుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ : టీడీపీ

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:14 AM

టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌ తదితరులు అన్నారు.

బాబుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ : టీడీపీ
మడకశిరలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తున్న దృశ్యం

మడకశిరటౌన, డిసెంబరు 17: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌ తదితరులు అన్నారు. వారు ఆదివారం పట్టణంలోని నాగన్నకుంట, శంకరలింగనబండ తదితరచోట్ల బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ కార్డులను అందించారు. నాలుగున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి జగన ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి కింద ఒక్క మడకశిర నియోజక వర్గానికే రూ.60కోట్ల నిధులు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ డాక్టర్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణమూర్తి, మున్సిపల్‌ మాజీ చైర్మన సుబ్బరాయుడు, నాయకులు మల్లికార్జున, పుల్లయ్య చౌదరి, శివ, రమేష్‌, సంతోష్‌, మంజు తదితరులు ఉన్నారు.

రొళ్ల : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకుమండలంలోని బీజీ హళ్లి పంచాయతీ టీడీపల్లిలో ఆదివారం మం డల కన్వీనర్‌ దాసిరెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకుడు ఈరన్న, తెలుగు యువ త నాయకుడు బాలకృష్ణ, నాయకులు భరత, సన్నమారప్ప, నాగేంద్ర, తి ప్పేస్వామి, మంజునాథ్‌, రమేష్‌, ఆనంద్‌, శివన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:14 AM