సొమ్ములు కేంద్రానివి.. సోకులు రాషా్ట్రనివా?

ABN , First Publish Date - 2023-03-31T00:01:30+05:30 IST

కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వమే చేస్తున్నట్లు చెప్పుకోవడానికి ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సిగ్గులేదా అంటూ బీజేపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ తలమర్ల హరికృష్ణ గౌడ్‌ విమర్శించారు.

సొమ్ములు కేంద్రానివి.. సోకులు రాషా్ట్రనివా?

బీజేపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ హరికృష్ణగౌడ్‌

పుట్టపర్తిరూరల్‌, మార్చి 30 : కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వమే చేస్తున్నట్లు చెప్పుకోవడానికి ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సిగ్గులేదా అంటూ బీజేపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ తలమర్ల హరికృష్ణ గౌడ్‌ విమర్శించారు. పుట్టపర్తిలోని బీజేపీ కార్యాల యంలో గురువారం ఆయన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అందులో జాతీయ రహదారులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రతి ఇంటికి రూ. 1.80లక్షలు, జలజీవన మిషన కింద ఇంటింటికి నల్లా, ఆయుస్మానభారత పథకం కింద ప్రతి వ్యక్తి ఉచితంగా ఎక్కడైనా వైద్యం పొందే అవకాశం కల్పిస్తోందన్నారు. ఆయుస్మానభారత పథకాన్ని ఆరోగ్యశ్రీ అనే పేరుతో, అలాగే మిగిలన పథకాల పేర్లు మార్చి తామే ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. సొమ్ములు కేంద్రానివి సోకులు మాత్రం మీవా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పైగా ఎమ్యెల్యే, మాజీ ఎమ్యెల్యే సవాళ్లు విసురుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలగంగాధర్‌, శేషాద్రినాయుడు, కొండమరాజు, సురేంద్ర, కళ్యాణ్‌, సోకేరామాంజనేయులు, పైపల్లి వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:01:30+05:30 IST