విశ్వ బతుకంతా బ్లాక్ మెయిల్ వ్యవహారాలే
ABN , First Publish Date - 2023-12-03T00:36:23+05:30 IST
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బతుకంతా బ్లాక్‌మెయిల్ వ్యవహారమేనని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్లను తొలగించాలని గంపగుత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని, అభ్యంతరాలపై కేవలం ఆనలైనలో ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.
పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్
అనంతపురం అర్బన, డిసెంబరు 2: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బతుకంతా బ్లాక్‌మెయిల్ వ్యవహారమేనని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్లను తొలగించాలని గంపగుత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని, అభ్యంతరాలపై కేవలం ఆనలైనలో ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. దీంతో విశ్వేశ్వరరెడ్డి బల్క్‌గా దరఖాస్తు చేయడం తప్పని నిరూపితమైందని అన్నారు. ఉరవకొండలో ఓట్లు తొలగించాలని విశ్వేశ్వరరెడ్డి దొడ్డిదారిలో బల్క్‌గా దరఖాస్తులు ఇస్తే జిల్లా అధికారులు రహస్యంగా విచారణ చేయించారని, రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాను ఎన్నికల పరిశీలకుడిని బెదిరించానని విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నారని, ఆ అధికారి ముఖం కూడా తాను చూడలేదని అన్నారు. విశ్వ విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడిదాకా బ్లాక్‌మెయిల్‌తోనే బతుకుతున్నారని అన్నారు. టికెట్ ఇవ్వకపోతే, పనిచేయకపోతే పార్టీ మారతా అని బ్లాక్‌మొయుల్ చేసే ఆయన నీతిసూత్రాలు చెబితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరుట ఓట్లు తొలగించేందుకు విశ్వ కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. ఆయన చేసిన తప్పులకు అధికారులు బలవుతున్నారని అన్నారు. ‘నీ తమ్ముడు బళ్లారిలో ఉన్నాడు. ఆయన ఓటు నీ ఇంటిలో ఉంది. ఇతరులపై ఫిర్యాదు చేసిన నీవు.. నీ తమ్ముడిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?’ అని నిలదీశారు. ‘పెళ్లి అయిన వారి ఓట్లన్నీ తొలగించాలని దరఖాస్తు చేశావు. మీ అక్కకు పెళ్లైనా మీ ఇంట్లో ఓటు లేదా?’ అని ప్రశ్నించారు. వలసలు భారత జీవన శైలిలో భాగమని ఎన్నికల సంఘం గుర్తించి, ఓటు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఓటర్లకే కల్పించిందని అన్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన విశ్వపై వంద కేసులు పెట్టాలని అన్నారు.