బాబు అరెస్టుతో వైసీపీ పతనం ఆరంభం

ABN , First Publish Date - 2023-09-20T00:00:44+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబును అక్రమ కేసులో అరెస్టు చేయడంతోనే వైసీపీ పతనం ఆరంభ మైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

బాబు అరెస్టుతో వైసీపీ పతనం ఆరంభం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల

మడకశిరటౌన, సెప్టెంబరు 19: మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబును అక్రమ కేసులో అరెస్టు చేయడంతోనే వైసీపీ పతనం ఆరంభ మైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. పట్టణంలోని ఆస్పత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష కార్యక్ర మంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరిం చుకొని దీక్షా శిబిరంలో వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించా రు. రాష్ట్రానికి జగనరెడ్డి అనే శని నుంచి విముక్తి కల్పించాలని, విజ్ఞాలు తొలిగి చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు నిర్వ హించినట్టు గుండుమల తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, జిల్లా లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్ర రైతు సాధికార ప్రతినిధి సురేష్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మంజునాథ్‌, మండల కన్వీనర్‌ మద్దనకుంటప్పతో పాటు మడకశిర, గుడిబండ మండలాల నాయకులుపాల్గొన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా పోస్టుకార్డుల ఉద్యమం

జగన కుట్రలు ఛేదించి మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు క్షేమంగా బయటకు వచ్చేలా శక్తిని ప్రసాదించాలని కోరుతూ మంగళవారం మిట్టబండ ఆంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు పేరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశేష పూజలు చేయించారు. గుండుమల తిప్పే స్వామి ఆధ్వర్యంలో ... రాజమండ్రి జైల్‌ సూపరింటెండెంట్‌కు లేఖల ద్వా రా తెలుపుతూ పోస్టుకా ర్డు ఉద్యమాన్ని చేపట్టారు. అగళిలో బుధవారం చేపట్టే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని గుండుమల కోరారు. కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, మాజీ సర్పంచి చంద్రప్ప, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, క్లస్టర్‌ ఇనచార్జ్‌లు నాగరాజు, అధికార ప్రతినిధి నాగరాజు, కౌన్సిలర్‌ ఉమాశంకర్‌, తెలుగు యువత తిమ్మరాజు, సోమ నాథరెడ్డి, హనుమంతరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:01:05+05:30 IST