జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.15,848 కోట్లు

ABN , First Publish Date - 2023-06-07T00:39:16+05:30 IST

జిల్లా వార్షిక రుణప్రణాళిక లక్ష్యం రూ.15,848 కోట్లుగా నిర్ణయించామని కలెక్టర్‌ గౌతమి ప్రకటించారు. జెడ్పీ ఆవరణంలోని డీపీఆర్‌సీ హాల్‌లో ఎల్‌డీఎం సత్యరాజ్‌ అధ్యక్షతన మంగళవారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. చైర్మన హోదాలో కలెక్టర్‌ గౌతమి వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు.

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.15,848 కోట్లు
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ గౌతమి

కలెక్టర్‌ గౌతమి

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 6: జిల్లా వార్షిక రుణప్రణాళిక లక్ష్యం రూ.15,848 కోట్లుగా నిర్ణయించామని కలెక్టర్‌ గౌతమి ప్రకటించారు. జెడ్పీ ఆవరణంలోని డీపీఆర్‌సీ హాల్‌లో ఎల్‌డీఎం సత్యరాజ్‌ అధ్యక్షతన మంగళవారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. చైర్మన హోదాలో కలెక్టర్‌ గౌతమి వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ పంట రుణాలతో పాటు అన్ని వర్గాలు, అన్ని రంగాలకు రూ.15,848 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో పంట రుణాల కింద రూ.7,742 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.3,310 కోట్లు, పరిశ్రమలు-సేవా రంగానికి రూ.1,962 కోట్లు కేటాయించారు. గృహ రుణాలకు రూ.280 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది వ్యవసాయేతర రంగాలకు రూ.2,188 కోట్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం అనూరాధ, ఎస్‌బీఐ ఆర్‌ఎం రమేష్‌, కెనరాబ్యాంకు ఆర్‌ఎం రాంప్రసాద్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:39:16+05:30 IST