Share News

పార్టీ బలోపేతమే లక్ష్యం: జనసేన

ABN , First Publish Date - 2023-12-11T00:20:27+05:30 IST

నసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, నియోజకవర్గ ఇనచార్జి పత్తి చంద్రశేఖర్‌ తెలిపారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం: జనసేన

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 10: జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, నియోజకవర్గ ఇనచార్జి పత్తి చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ సేవలు అందుబాటులో ఉండాలని కార్యాలయం ప్రారంభించామన్నారు.

అమడగూరు: జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మండలం లో పార్టీ కార్యాలయం ప్రారంభించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక చౌడేశ్వరీ దేవి కళ్యాణమండపంలో జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ హాజరై మాట్లాడుతూ పవనకళ్యాణ్‌ ఆధ్వర్యంలో పార్టీని బ లోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు.

Updated Date - 2023-12-11T00:20:28+05:30 IST