చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:54 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
- మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు
గుంతకల్లు, డిసెంబరు 17: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జితేంద్రగౌడు మాట్లాడుతూ ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా పనిచేయాల్సిన తరుణ మిదన్నారు. కొందరి ధోరణి వల్ల పార్టీ కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారని, వారు పద్ధతిని మార్చుకుని పార్టీ అభ్యున్నతి కోసం కలిసిరావాలని తెలియజేశారు. ఈ నెల 20న జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, ప్రతాప్ నాయుడు, మస్తానప్ప, టీ కేశప్ప, పాల మల్లికార్జున, కే కృపాకర్, కే చంద్రశేఖర్, జిలాన బాషా, అనిల్ కుమార్ గౌడు, కే శివన్న, బీ రామన్న చౌదరి, కేసీ రామాంజనేయులు, రాఘవేంద్ర, గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల నాయకులు పాల్గొన్నారు.