చంద్రబాబు అరెస్టును నిరసిస్తున్న తెలుగుజాతి

ABN , First Publish Date - 2023-09-26T00:22:06+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని తెలుగువారేకాక, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని తెలుగువారు సైతం నిరసిస్తున్నారని జితేంద్రగౌడు పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తున్న తెలుగుజాతి

- మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

గుంతకల్లు, సెప్టెంబరు23: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని తెలుగువారేకాక, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని తెలుగువారు సైతం నిరసిస్తున్నారని జితేంద్రగౌడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణం లోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ రిలే నిరాహార దీక్షలను కొనసాగించా రు. రిలే దీక్షలను టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవనకుమార్‌ గౌడు ప్రారంభించారు. కాలవ శ్రీనివాసులును పరామర్శించడానికి, దీక్షకు సంఘీభావాన్ని తెలపడానికి రాయదుర్గం వెళ్లిన జితేంద్రగౌడు మధ్యాహ్నం రిలే దీక్షా శిబిరం వద్దకు వచ్చి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జితేంద్రగౌడు మాట్లాడుతూ చంద్రబాబు ఎలాంటివారో, ఆయన నిబద్ధత ఎలాంటి దో అందరికీ తెలుసన్నారు. రాజకీయ దురుద్దేశ్యంలో కేసులు పెట్టి, రిమాండుకు పంపినంత మా త్రాన చంద్రబాబు వ్యక్తిత్వాన్ని మసకబార్చలేరన్నారు. రానున్న ఎన్నికల్లో జగనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ నాయకులు బండారు ఆనంద్‌, పత్తి హిమ బిందు దీక్షాధారులకు మద్దతు తెలికారు. కార్యక్రమంలో బీఎస్‌ కృష్ణారెడ్డి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు, అనిల్‌ కుమార్‌గౌడు, తలారి మస్తానప్ప, టీ కేశప్ప, పాల మల్లికార్జున, హనుమంతు, ముక్కన్నగారి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:22:06+05:30 IST