పాదయాత్రకు భారీగా తరలిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2023-03-26T23:58:31+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు ఆదివారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీ గా తరలివెళ్లారు. రొద్దం టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు వెళ్లి, గో రంట్ల మండంలోని గౌనివారిపల్లి వద్ద పాదయాత్రకు స్వాగతం పలికారు.

పాదయాత్రకు భారీగా తరలిన తెలుగు తమ్ముళ్లు

రొద్దం, మార్చి 26: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు ఆదివారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీ గా తరలివెళ్లారు. రొద్దం టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు వెళ్లి, గో రంట్ల మండంలోని గౌనివారిపల్లి వద్ద పాదయాత్రకు స్వాగతం పలికారు. నారా లోకేశకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బరత్నమ్మ, చిన్నప్పయ్య, రొద్దం నరసింహులు, నరహరి, హరీష్‌, పవనకుమార్‌, మురళి, అనసూయమ్మ, లీలావతి, తులసీ, సుజాత, బేబి పాల్గొన్నారు.

పెనుకొండ: యువగళం పాదయాత్ర గోరంట్ల మండలం గౌనివారిపల్లి వద్ద పెనుకొండ నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నా రా లోకేశకు స్వాగతం పలకడానికి పట్టణ నాయకులు, తెలుగుతమ్ముళ్లు పెద్దఎత్తున బయలుదేరి వెళ్లారు. జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి, నాయకులు జీవీపీ నాయుడు, మునిమడుగు వెంకటరాముడు, కురుబ కృష్ణమూ ర్తి, సవిత, నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్యానర్లతో భారీఎత్తున బయలుదేరి వెళ్లారు.

మడకశిరటౌన: నారాలోకేశ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తరలివెళ్లారు. పట్టణ సమీపంలోని మిట్టబండ ఆంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత రం అక్కడి నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. టీడీపీ వక్కలిగ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప, మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వర్థరామప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌, మాజీ మండల కన్వీనర్‌ రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు ఉగ్రనరసింహప్ప, రాజగోపాల్‌, మాజీ మున్సిప ల్‌ చైర్మన ప్రకాష్‌, కిష్టప్ప, సాగర్‌, మంజునాథ్‌ తదితరులు ఉన్నారు.

పాదయాత్రలో సవిత

పెనుకొండ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర 51వ రోజు ఆదివారం పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

Updated Date - 2023-03-26T23:58:31+05:30 IST