జీవో 117ను రద్దు చేయాలి: ఫ్యాప్టో
ABN , First Publish Date - 2023-06-07T23:58:14+05:30 IST
అనంతపురం విద్య, జూన 7: పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేసి, స్కూళ్లను విచ్చిన్నం చేసే జీవో 117ను రద్దు చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. డీఈఓ కార్యాలయం వద్ద ఆ సంఘం నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఉపాధ్యాయుల పట్ల ప్రిన్సిపల్ సెక్రెటరీ వైఖరి సరికాదని అన్నారు.
అనంతపురం విద్య, జూన 7: పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేసి, స్కూళ్లను విచ్చిన్నం చేసే జీవో 117ను రద్దు చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. డీఈఓ కార్యాలయం వద్ద ఆ సంఘం నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఉపాధ్యాయుల పట్ల ప్రిన్సిపల్ సెక్రెటరీ వైఖరి సరికాదని అన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని, ఉద్యోగోన్నతులను రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. చట్టబద్ధమైన 12వ పీఆర్సీని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 11వ పీఆర్సీ మేరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టీచర్ల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా చైర్మన సిరాజుద్దీన, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రమణారెడ్డి, నాయకులు గోవిందరాజులు, సూర్యుడు, కోటేశ్వరప్ప, లింగమయ్య, సతీష్, సురేష్, రాజశేఖర్, వెంకటరమణ, సర్దార్‌వలి, శంకరమూర్తి, శివశంకర్, నారాయణస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.