వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం

ABN , First Publish Date - 2023-03-02T00:15:04+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని... రాష్ట్రంలో, ధర్మవరంలో కూడా టీడీపీ జండా ఎగురుతుందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం

లోకేశ పాదయాత్రను విజయవంతం చేద్దాం: పరిటాల శ్రీరామ్‌

దర్మవరం రూరల్‌, మార్చి 1: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని... రాష్ట్రంలో, ధర్మవరంలో కూడా టీడీపీ జండా ఎగురుతుందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి, సుబ్బరావుపేటలో నియోజకవర్గ పరిశీలకులు మల్లికార్జునతో కలిసి పర్యటించా రు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల ప్రజలు, టీడీపీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. జిల్లాలో జరిగే నారా లోకేశ పాదయాత్రకు ప్రతి ఒక్కరు తరలిరావాలని పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తున్నా ఆయన ఎక్కడా తగ్గకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. మరి కొన్ని రోజుల్లో పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో ప్రారంబమవతుందని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనేందుకు సిద్ధం కావాలని తెలిపారు. మన ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు వైకుంఠం మల్లికార్జున మాట్లాడుతూ... పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం ఇనచార్జ్‌గా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా... బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాటం చేసిన నాయకుడు పరిటాల రవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన ఓబిరెడ్డి, నా యకులు మహేష్‌ చౌదరి, కమతం కాటమయ్య, కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్‌ లక్ష్మన్న, గొట్లూరు శ్రీనివాసులు, చిగిచెర్ల రాఘవరెడ్డి, తెలుగుయువత విజయ్‌ చౌదరి, జగంగ నరసింహులు, మల్లేనిపల్లి చంద్ర, అశోక్‌ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:15:04+05:30 IST