టీడీపీ సానుభూతి పరులమని... న్యాయం చేయడం లేదు
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:22 AM
మేము టీడీపీ సానుభూతిపరులమని మండలంలోని పెద్దకోడిపల్లిలో రోడ్డును ఆక్రమించిన వారిని వదిలిపెట్టి అధికారులు మాకు న్యాయం చేయడం లేదని బాధితులు ఆరోపిస్తు న్నారు.
బాధితుల ఆవేదన
రొద్దం, డిసెంబరు 28: మేము టీడీపీ సానుభూతిపరులమని మండలంలోని పెద్దకోడిపల్లిలో రోడ్డును ఆక్రమించిన వారిని వదిలిపెట్టి అధికారులు మాకు న్యాయం చేయడం లేదని బాధితులు ఆరోపిస్తు న్నారు. వారు గ్రామంలో విలేకరుల వద్ద గురువారం తమ గోడు వెళ్లబో సుకున్నారు. మండలంలోని పెద్దకోడిపల్లిలో దేవరలింగప్ప కుమారులు పోతన్న, నరసింహప్ప, గోవిందప్ప తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించి బండలు పాతారని నాగరంగమ్మ, అక్కమ్మ, నరస్వతమ్మ తెలిపారు. దీంతో తమ ఇంటికి దారి లేకుండా పోయిందని, దారి చూపించాలని వేడుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమ ఇంటి దారి కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపో యామన్నారు. 2018లో రస్తా వివాదంపై కోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిం దని అయితే అధికారులు మాత్రం మాకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకోడిపల్లిలో టీడీపీ సానుభూతిపరులుగా మాకు ముద్రప డటంతో అధికారులు సైతం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఏఎ్‌సపీ, డీఎస్పీ, పెనుకొండ సీఐ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా మాకు న్యాయం జరగడం లేదన్నారు. కోర్టు రస్తా వివాదంపై మాకు అనుకూలంగా తీర్పు వస్తే వాటిని అమలు పరచాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో దేవరలింగప్ప కుటుంబ సభ్యులు ఇటీవలే రోడ్డుకు అడ్డంగా బండలు పాతారని తెలిపారు. వాటిని తీసి వేయించాలని తాము తిరగని అధికారులు లేరన్నారు. న్యాయం కోసం వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు రస్తా వివాదంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.