Share News

నల్లబెలూన్లతో టీడీపీ నిరసన

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:34 AM

అనంతలో వైసీపీ చేపట్టిన సామా జిక సాధికార బస్సు యాత్రకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నల్లబెలూన్లను గాల్లోకి వదిలేసి నిరసన వ్యక్తం చేశారు

 నల్లబెలూన్లతో టీడీపీ  నిరసన
నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

అనంతపురం అర్బన, డిసెంబరు 29: అనంతలో వైసీపీ చేపట్టిన సామా జిక సాధికార బస్సు యాత్రకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నల్లబెలూన్లను గాల్లోకి వదిలేసి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం అనంతపురం అర్బనలోని రాంనగర్‌లో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీల ద్రోహి సీ ఎం జగన అంటూ నినదించారు. కార్యక్రమంలో నాయకులు దేవళ్ల మురళీ, గోపాల్‌ గౌడ్‌, పోతుల లక్ష్మీనరసింహులు, సైఫుద్దీన, జేఎం బాషా, రఫిక్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రవికుమార్‌ చౌదరి, మహిళలు విజయశ్రీరెడ్డి, సరళ పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:34 AM