మరియమ్మకు టీడీపీ పింఛన
ABN , First Publish Date - 2023-03-02T00:45:15+05:30 IST
శెట్టూరు మండలం యర్రబోరేపల్లికి చెందిన అంధమహిళ మరియమ్మకు ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు పింఛన అందజేశారు. ఆయన తరఫున పార్టీ నాయకులు యర్రబోరేపల్లికి వెళ్లి రూ.2750 బుధవారం అందచేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగం గా గతనెలలో ఉమామహేశ్వరనాయుడు ఆ ఊరికి వెళ్లారు. ఆయనను కలిసిన మరియమ్మ, తనకు పింఛన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వం ఏర్పడే వరకూ కొనసాగింపు
మాట నిలబెట్టుకున్న ఉమామహేశ్వరనాయుడు
కంబదూరు (కళ్యాణదుర్గం), మార్చి 1: శెట్టూరు మండలం యర్రబోరేపల్లికి చెందిన అంధమహిళ మరియమ్మకు ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు పింఛన అందజేశారు. ఆయన తరఫున పార్టీ నాయకులు యర్రబోరేపల్లికి వెళ్లి రూ.2750 బుధవారం అందచేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగం గా గతనెలలో ఉమామహేశ్వరనాయుడు ఆ ఊరికి వెళ్లారు. ఆయనను కలిసిన మరియమ్మ, తనకు పింఛన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన ఉమా, అధికారులతో చర్చించి పింఛన అందేలా చూస్తానని అన్నారు. అధికారులను సంప్రదించినా ఆమెకు పింఛన మంజూరు కాలేదు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఇక నుంచి ప్రతి నెలా తానే పింఛన ఇస్తానని ఉమా తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు ఆమెకు ‘చంద్రన్న స్ఫూర్తితో ఉమన్న సాయం’ పేరిట ప్రతి నెలా రూ.2,750 అందచేస్తామని తెలిపారు. తనకు అండగా నిలిచిన ఉమాకు మరియమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన దొడగట్ట నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి రామరాజు తదితరులు పాల్గొన్నారు.