మహిళల కోసం టీడీపీ మహాశక్తి పథకం

ABN , First Publish Date - 2023-05-29T23:53:31+05:30 IST

రాజమహేం ద్రవరంలో జరి గిన మహా నా డు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ మినీ మ్యానిఫెస్టోను సోమవారం విడుదల చేశారు.

మహిళల కోసం టీడీపీ మహాశక్తి పథకం

తెలుగు మహిళలహర్షం

కదిరి, మే29: రాజమహేం ద్రవరంలో జరి గిన మహా నా డు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ మినీ మ్యానిఫెస్టోను సోమవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా మహిళల కోసం మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ సీనియర్‌ నాయకురాలు, మహిళ కమిషన మాజీ సభ్యురాలు పర్వీనబాను ఆధ్వర్యంలో పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. తెలుగు మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ముందుగా నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరా భిషేకం చేశారు. మహిళలు టీడీపీకి ఓట్లు వేసి ఆదరించాలని కోరారు. రాష్ట్రం బాగు పడాలన్నా, సుపరిపాలన కావాలన్న టీడీపీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ సావిత్రమ్మ, ఎస్సీసెల్‌ ప్రేమలత, నియోజకవర్గ అధ్యక్షురాలు గంగరత్న మ్మ, శారద, రమణమ్మ, గౌరమ్మ, రమాదేవి, లక్ష్మీదేవి, పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-29T23:53:31+05:30 IST