యువగళం పాదయాత్రలో టీడీపీ నాయకులు
ABN , First Publish Date - 2023-03-19T00:22:05+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్ర శనివారం కదిరి నియోజకవర్గంలో కొనసా గింది.

మడకశిరటౌన, మార్చి 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్ర శనివారం కదిరి నియోజకవర్గంలో కొనసా గింది. పాదయాత్రలో మడకశిర నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈ రన్న, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచి వెంట ఉండి పాదయాత్రలో నారాలోకేశతోపాటు నడిచారు.
పెనుకొండ: నారాలోకేశ యువగళం పాదయాత్రలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, నాయకులు త్రివేంద్రనాయుడు, బాబుల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మారుతి తదితరులు సంఘీభావం తెలిపారు. చీకటిమానుపల్లి నుంచి చిన్న పిల్లోళ్లపల్లి వరకు లోకేశ వెంట నడిచారు.
అగళి: మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఉమే్‌షతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్లి యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. నారాలోకేశకు శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో క్లస్టర్ ఇనచార్జి శివకుమార్, కన్వీనర్ కుమారస్వా మి, భూతరాజు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాసులు, నరసింహ ప్ప, బసవరాజు, ప్రధాన కార్యదర్శి జయన్న, నారాయణ పాల్గొన్నారు.
రొళ్ల: మండల అధ్యక్షుడు దాసిరెడ్డి, ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు కృష్ణమూ ర్తి, మాజీ ఎంపీపీ కిష్టప్ప, క్లస్టర్ ఇనచార్జి సిద్దగంగప్ప, తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ, తెలుగు తమ్ముళ్లు యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. నారా లోకేశకు సంఘీభావం ప్రకటించారు.
గుడిబండ: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సీసెల్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నారా లోకేశ వెంట పాదయాత్రగా నడిచి, సంఘీభావం తెలియజేశారు.