జూడోలో నసనకోట విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:55 PM
అనంతపురంలో జరిగిన ఆర్డీటీ జూడో సెంట్రల్‌లీగ్ పోటీలలో ఓవలాల్ చాంపియనగా నసనకోట ఉన్నత పాఠశాల జట్టు నిలిచినట్టు పీడీ చామంతి గురువారం తెలిపారు.
రామగిరి, డిసెంబరు 28: అనంతపురంలో జరిగిన ఆర్డీటీ జూడో సెంట్రల్‌లీగ్ పోటీలలో ఓవలాల్ చాంపియనగా నసనకోట ఉన్నత పాఠశాల జట్టు నిలిచినట్టు పీడీ చామంతి గురువారం తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన జూడో పోటీల్లో పెనుకొండ జోన నుంచి నసనకోట విద్యార్థులు బాలికల విభాగంలో హరిణి, సుమలత గోల్డ్‌మె డల్, తేజస్విని సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. బాలుర వి భాగంలో రఘురాం, విజయరాజు, ముద్దుకిష్ణ, సాయిచరణ్ గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఓవరాల్ చాంపియనషిప్‌గా నిలిచినట్టు ఆమె తెలిపారు. హెచఎం, పీడీ, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆ వి ద్యార్థులను అభినందించారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.