Share News

వైసీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN , First Publish Date - 2023-12-03T00:40:41+05:30 IST

పుట్టపర్తి, డిసెంబరు 2: వైసీపీ అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సూచించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం పల్లె చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

వైసీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

పల్లెకు చంద్రబాబు సూచన

పుట్టపర్తి, డిసెంబరు 2: వైసీపీ అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సూచించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం పల్లె చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామన్నారు. కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి అండగా నిలిచి, వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని తెలిపారు. ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ మరింత చురుగ్గా పనిచేయాలని సూచించినట్లు పల్లె తెలిపారు. పార్టీకి, ప్రజలకు మీరు అందిస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని అభినందించారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించేలా పని చేయాలని సూచించినట్లు ఆయన చెప్పారు.

Updated Date - 2023-12-03T00:40:45+05:30 IST