విశ్వకర్మ సమ్మాన యోజనను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2023-09-26T00:27:07+05:30 IST

చేతి, కులవృత్తుల వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వకర్మ సమ్మాన యోజనను సద్వినియోగం చేసుకోవా లని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్కొన్నారు.

విశ్వకర్మ సమ్మాన యోజనను సద్వినియోగం చేసుకోండి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌

గుంతకల్లు టౌన, సెప్టెంబరు 25: చేతి, కులవృత్తుల వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వకర్మ సమ్మాన యోజనను సద్వినియోగం చేసుకోవా లని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని నామాలాసెట్‌ కల్యాణ మండపంలో సోమవారం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కులవృత్తు ల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా సత్యకుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి, కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు ప్రధాని విశ్వకర్మ సమ్మాన యోజనను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకున్న కులవృత్తుల వారికి శిక్షణ ఇచ్చి, బ్యాంక్‌ ద్వారా రూ.1.లక్ష ఇస్తారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4లక్షల మందికి ఈ అవకాశం కల్పిస్తున్నార న్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, లలితకుమార్‌, చిరంజీవి రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, కొలమి రామాంజినేయులు, విశ్వనాథ్‌, రాఘవేంద్ర ప్రసాద్‌, వడ్డే రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:27:07+05:30 IST