మట్టి మాఫియాపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2023-08-22T00:21:26+05:30 IST

ధర్మవరం, ఆగస్టు 21: బత్తలపల్లి మండలంలో మాల్యవంతం వద్ద ఉన్న చెరువులోని మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులును కోరారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధుతోపాటు నాయకులు సోమవారం పట్టణంలో డీఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.

  మట్టి మాఫియాపై చర్యలు తీసుకోండి

డీఎస్పీకి సీపీఐ నాయకుల వినతి

ధర్మవరం, ఆగస్టు 21: బత్తలపల్లి మండలంలో మాల్యవంతం వద్ద ఉన్న చెరువులోని మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులును కోరారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధుతోపాటు నాయకులు సోమవారం పట్టణంలో డీఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మాల్యవంతం చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా పలువురు మట్టిని తరలిస్తుండడంపై తాము ఇది వరకే తహసీల్దార్‌కు, సచివాలయ ఉద్యోగులకు తెలిపామని, కాగా వారు ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. రైతులకు ఉపయోగపడే మట్టిని కొందరు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. సీపీఐ మండల నాయకులు చెరువు వద్దకు వెళితే.. అక్కడ ఉన్న అధికారపార్టీ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడని వాపోయారు. దీనిపై మీరైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుళ్లాయప్ప, సీపీఐ పట్టణ కార్యదర్శి రవి, సహాయకార్యదర్శి యర్రంశెట్టి రమణ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పోతలయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:21:26+05:30 IST