విజయవంతంగా బస్సు యాత్ర
ABN , First Publish Date - 2023-06-26T00:59:29+05:30 IST
రాష్ట్రంలో వైసీసీ ప్రభుత్వం వైఫల్యాలను అరాచకా లను ఎండగడుతూ... టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఈ మహానాడులో టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటిం చిన పథకాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ భవిష్య త్తుకు గ్యారెంటీ పేరుతో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
పెనుకొండ, జూన 25 : రాష్ట్రంలో వైసీసీ ప్రభుత్వం వైఫల్యాలను అరాచకా లను ఎండగడుతూ... టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఈ మహానాడులో టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటిం చిన పథకాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ భవిష్య త్తుకు గ్యారెంటీ పేరుతో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెనుకొండ నియోజకవర్గంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభమైం ది. బస్సుయాత్ర మధ్యాహ్నం 1గంటకు పెనుకొండ పట్టణానికి చేరింది. తెలుగుదేశం పార్టీ పాలనలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ డిపో వద్ద నాయకులు సెల్ఫీ చాలెంజ్ తీసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం బాబయ్యదర్గాకు చేరుకుని దర్గాపీఠాధిపతి కుమారుడు సలావుద్దీనబాబాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కలిసి బాబయ్య దర్గాకు వెళ్లి స్వా మి సమాధికి చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. దర్గాకు వచ్చిన నా యకులకు ముస్లిం సంప్రదా య పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి, తెలుగుతల్లి విగ్ర హానికి పూలమాలలువేశారు. భోజనాల అనంతరం రొద్దం మండలానికి బ యలుదేరి వెళ్లారు. బస్సు యాత్ర సాగిన ప్రతి గ్రామంలోనూ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. నాయకులు ప్రజలకు మేని ఫెస్టో ప్రతులను అందజే శారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ యాత్రలో బీకేతోపాటు మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పరిశీలకుడు నరసింహయాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, రాష్ట్ర నాయకులు కుంటిమద్ది రంగయ్య, లక్ష్మీనారాయణ, గుండుమల తిప్పేస్వామి, ఈరన్న, మునిమడుగు వెంకటరాముడు, కేశవయ్య, కురుబ కృష్ణమూర్తి, రఘువీరచౌదరి, రవిశంకర్, పోతిరెడ్డి, గుట్టూరు నాగరాజు, సుబ్బరాయుడు, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.